3RD anniversary of quick news

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు...

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..!





దిల్లీ: ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు భారత్‌కు రానే వచ్చాయి. ఈ నైరుతి రుతుపవనాల ఆగమనం కేరళలోకి సోమవారం ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహోపాత్ర వెల్లడించారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అనుకున్న సమయానికే రుతుపవనాలు చేరుకున్నాయని తెలిపారు.

అయితే, నైరుతి రుతుపవనాల ఆగమనం ఈసారి కాస్త ఆలస్యం కానుందని వాతావరణశాఖ తొలుత అంచనా వేసిన విషయం తెలిసిందే. జూన్‌ 5న కేరళ తీరాన్ని తాకవచ్చని ప్రకటించిన ఐఎండీ.. వాతావరణ మార్పులతో జూన్‌ 1నే చేరుకుంటాయని గత నాలుగు రోజుల క్రితం స్పష్టం చేసింది. అంచనాకు తగినట్లుగానే రుతుపవనాల ఆగమనం ప్రారంభం కావడంతో రైతాంగంలో ఆనందం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా దేశంలో ఈ సారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని గత నెలలోనే భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జూన్‌-సెప్టెంబర్‌ మధ్యలో పడే వర్షాలపైనే దేశంలో దాదాపు సగానికి పైగా వ్యవసాయ సేద్యం ఆధారపడి ఉంటుంది.

Post a Comment

0 Comments